దులీప్ ట్రోఫీ ఫైనల్స్‌కు సౌత్, ఈస్ట్ జోన్లు చేరుకున్నాయి. నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నార్త్ జోన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 195, 289 పరుగులు చేసింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకం (116*) బాదిన కెప్టెన్ తిలక్ వర్మ, రెండో ఇన్నింగ్స్‌లో (51*) అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.