అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దక్షిణ కొరియా అరుదైన గౌరవం ఇవ్వనుంది. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి దక్షిణ కొరియా చేరుకున్న ట్రంప్‌కు, అక్కడి అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ అత్యున్నత అవార్డు గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా, చియోన్మాచాంగ్ నకలు బంగారు కిరీటాన్ని బుధవారం గ్యోంగ్జు నేషనల్ మ్యూజియంలో బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ అరుదైన గౌరవం ట్రంప్ పర్యటనలో ఒక ముఖ్య ఘట్టంగా నిలవనుంది.