గాయకులందరికీ ఎస్పీ బాలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ శైలజ (వీడియో)

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలు సోదరి, గాయని ఎస్పీ శైలజ మాట్లాడుతూ, ఎస్పీ బాలు గాయకులందరికీ స్ఫూర్తిదాయకమని, తనకు అన్నయ్యగా కొత్త బాటను ఏర్పరిచారని తెలిపారు. విగ్రహం ఏర్పాటుపై జరుగుతున్న వివాదం గురించి తనకు తెలియదని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, సంగీత కమిటీ చూసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ఆయన బతికి ఉన్నప్పుడే తన విగ్రహాన్ని ఘంటసాల విగ్రహం పక్కన పెట్టాలని అన్నట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్