యూపీలో కాంగ్రెస్‌కు 26 సీట్లు ఆఫర్‌ చేసిన ఎస్పీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ, కాంగ్రెస్‌కు 26 సీట్లను ఆఫర్ చేసినట్లు ఎస్పీ సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ వెల్లడించారు. ఈ 26 స్థానాల్లో గతంలో కాంగ్రెస్ గెలిచిన 2 స్థానాలు, రెండో స్థానంలో నిలిచిన 4 స్థానాలు ఉన్నాయి. మరో 20 స్థానాల్లో గత ఎన్నికల్లో ఎస్పీకి 60 నుండి 70 వేల ఓట్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ 130 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదించగా, ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై రెండో విడత చర్చలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕