TG: మరికాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో టీమ్‌ఇండియా గెలవాలని రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ తుది పోరులో భారత క్రికెట్ జట్టు విజయం సాధించాలని కాంక్షిస్తూ హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.