స్పైస్‌జెట్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో 160 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 167 మంది ఉన్నారు. పైలట్లు వెంటనే స్పందించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్