బిహార్‌లోని దర్భంగా విమానాశ్రయంలో మంగళవారం ముంబయి నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం రన్‌వేపై దిగుతుండగా టైర్ పేలింది. ఈ విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ల చాకచక్యంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు, అయితే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే విమానాశ్రయంలో ఆకాశా ఎయిర్ విమానానికి కూడా సాంకేతిక సమస్య ఎదురైంది. ఈ సంఘటనల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.