ప్రపంచవ్యాప్తంగా ‘స్పైడర్ మ్యాన్-బ్రాండ్ న్యూ డే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. భారతదేశంలో ఈ చిత్రం 6వ రోజున రూ.22 కోట్ల నెట్ వసూళ్లతో సహా మొత్తం రూ.303 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. 3D చార్జీలతో కలిపి మొత్తం రూ.340 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. వసూళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డు సృష్టించనుంది. తెలంగాణ నుండి రూ.28 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుండి రూ.14 కోట్లు వసూలయ్యాయి.