ముంబై వీధుల్లో 'స్పైడర్ మ్యాన్' (వీడియో)

ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ యువకుడు ప్రజలకు సహాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కంటెంట్ క్రియేటర్ మోమిన్ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించి వరద నీటితో నిండిన రోడ్లపై గుంతలు కనిపించక ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పాదచారులకు దారి చూపిస్తూ సహాయం చేస్తున్నాడు. ప్రమాదకర ప్రాంతాల వద్ద అప్రమత్తం చేస్తూ ప్రజల భద్రత కోసం చేస్తున్న ఈ వినూత్న సేవకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్