టామ్ హాలండ్ హీరోగా నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయంగా రూ.500 కోట్ల నెట్ వసూళ్లను దాటిన తొలి హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఆరో వీకెండ్లోనూ రూ.1.98 కోట్ల నెట్ కలెక్షన్ సాధించగా, మొత్తం ఇండియా నెట్ వసూళ్లు రూ.500.21 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 2.41 బిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.