ఉక్రెయిన్ "స్పైడర్’స్ వెబ్" అనే కోడ్‌నేమ్‌తో రహస్యంగా చేపట్టిన ఆపరేషన్‌లో 4 రష్యన్ వాయుసేన బేసులపై డ్రోన్ల దాడులు నిర్వహించాయి. రష్యాలో ఇప్పటివరకు ఉక్రెయిన్ చేసిన అతి పెద్ద డ్రోన్ దాడి ఇది. ఉక్రెయిన్ భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ డ్రోన్‌లను కలపతో తయారు చేసిన షెడ్‌లలో దాచేసి, ట్రక్కుల ద్వారా రష్యన్ స్థావరాలకు తరలించబడ్డాయి. ఈ విషయాన్ని రాయిటర్స్‌కు ఓ ఉక్రెయిన్ అధికారి వెల్లడించారు.