హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'స్పిరిట్'. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రిగా నటించనున్నారని, ఇందుకోసం ఆయన డేట్స్ కూడా ఇచ్చారని సమాచారం. సందీప్ రెడ్డికి చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని, ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే. ఈ చిత్రంలో ప్రభాస్, సంజయ్ దత్ అన్నదమ్ములుగా కనిపించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.