ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక నెల పాటు తాత్కాలికంగా నిలిచిపోయింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, గత నాలుగు, ఐదు రోజుల క్రితం వరకు ఎలాంటి విరామం లేకుండా చిత్రీకరణలో పాల్గొన్నానని, ఈ చిన్న విరామం తర్వాత కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. సినిమా పనులు అద్భుతంగా జరుగుతున్నాయని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తాము కూడా ఉత్సాహంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, దివంగత కిరణ్ జ్ఞాపకార్థం ఒక సంస్మరణ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.