భారత కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడి వివాహానికి క్రీడా దిగ్గజాలు తరలివెళ్లారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల శుభ్ వివాహ్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీలు సతీ సమేతంగా పాల్గొన్నారు. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా సైతం వివాహ మహోత్సవంలో తళుక్కుమంది.