జపాన్‌లో TAJ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

జపాన్‌లోని టోక్యోలో, తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (TAJ) ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా పాల్గొన్నారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు, స్థానిక జపాన్ సమాజంతో సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕