శ్రీలంక-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 549 పరుగులు డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. షాయ్ హోప్ (86), జస్టిన్ గ్రీవ్స్ (85) లు రాణించారు. శ్రీలంక తరఫున లహీరు ఉదార (188) భారీ స్కోరు సాధించాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.