శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ క్రికెటర్‌ (వీడియో)

శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న TG20 లీగ్‌లో ‘ఖమ్మం ఏసెస్’ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఆయన, హైదరాబాద్ షెడ్యూల్ మధ్యలో లభించిన విరామ సమయంలో తిరుమలకు చేరుకున్నారు. ఆలయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ధోతి ధరించి స్వామివారి సేవలో పాల్గొన్న దిల్షాన్‌కు అర్చకులు వేదాశీర్వచనం పలకగా, టీటీడీ అధికారులు శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్