ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రీకాకుళం కుర్రాడు.. కేంద్ర మంత్రి విషెస్

AP: శ్రీకాకుళం జిల్లా‌కు చెందిన త్రిపురాణ విజయ్ ని ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. విజయ్ ఐపీఎల్‌లో చోటు దక్కించుకోవడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. 'శ్రీకాకుళం జిల్లా నుండి ఐపీఎల్‌కు ఎంపికయిన త్రిపురాణ విజ‌య్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ కొత్త అధ్యాయంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్