రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమాలో శ్రీలీల నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ వైద్యుడిగా కనిపించనున్నట్లు సమాచారం. రామ్ పోతినేని, సిమ్రాన్, రాశీఖన్నా, నయనతార, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.