ఏడు దశాబ్దాలలో లేనంతగా శ్రీనగర్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు

జమ్మూకశ్మీర్‌లో వేడి గాలులు వీస్తున్నాయి. గత ఏడు దశాబ్దాలలో లేనంతగా గరిష్ట ఉష్ణోగ్రతలు శ్రీనగర్‌లో శనివారం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీనగర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. శ్రీనగర్‌లో ఆల్-టైమ్ అత్యధిక ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెల్సియస్. ఇది జులై 10, 1946న నమోదు అయింది. పహల్గామ్‌, ఖాజిగుండ్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్