శ్రీవారి ఆర్జిత సేవల కోటా షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన కోటాను టీటీడీ ఆదివారం విడుదల చేసింది. ఆగస్టు 18 నుండి 20 వరకు సుప్రభాతం, తోమాల వంటి ఆర్జిత సేవల లక్కీడిప్ నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 21న కల్యాణోత్సవం, వర్చువల్ సేవల కోటా విడుదల అవుతుంది. ఆగస్టు 24న అంగప్రదక్షిణం, దివ్యాంగుల టోకెన్లు, ఆగస్టు 25న రూ.300 దర్శనం, అద్దె గదుల కోటా విడుదల కానుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕