AP: వచ్చే నెల 12 నుంచి 20వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చాంద్రమానం ప్రకారం మూడేళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఈ సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు. ప్రతి రోజు 3 సార్లు వాహన సేవ నిర్వహిస్తారు.