మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

AP: మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు ఉండటంతో, ఆనవాయితీ ప్రకారం ఉదయం 9 గంటలకే ఆలయ తలుపులు మూసివేస్తారు. గ్రహణానంతరం శుద్ధి, పుణ్యహవచనం తర్వాత రాత్రి 8:30 నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆ రోజున అన్నప్రసాద వితరణ, పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్