TG: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (వర్కింగ్ టైటిల్) ఈవెంట్ శనివారం సాయంత్రం ఘనంగా జరుగనున్నది. ప్రియాంకా చోప్రా ఈ కార్యక్రమ వివరాలను తన అభిమానులతో వీడియో ద్వారా పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, “నేనెందుకు ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉంటున్నానో నవంబరు 15న తెలుసుకోండి. మాతో జాయిన్ అవ్వండి. ఈవెంట్ ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమ్ అవుతుంది” అని చెప్పారు. మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా కీలక పాత్రలో కనిపించనున్నారు.