మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'SSMB29' సినిమాకు సంబంధించిన మొదటి ఈవెంట్ శనివారం (15న) రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి మహేశ్ బాబు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తారని, పోలీసులకు సహకరించాలని కోరారు. పాస్ లేకుండా కంగారు పడి రావొద్దని వీడియోలో తెలిపారు.