TG: నల్గొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చెంచు జాతికి చెందిన కుటుంబానికి వైద్యం చేయకుండా.. దుర్వాసన వస్తుందని ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపించేసింది. ఓటు హక్కును వినియోగించుకొని వస్తుండగా దుప్పలపల్లి వద్ద రోడ్డుప్రమాదంలో మాడుగులపల్లి చర్లగూడకు చెందిన ఓ కుటుంబం గాయపడింది. నడవలేని స్థితిలో ఉన్నామని, అడ్మిట్ చేసుకోవాలని వేడుకున్నా సిబ్బంది పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు.