రాహుల్ గోల్డెన్ డక్.. సోషల్ మీడియాలో 'స్టెయిర్‌కేస్ జైబ్ వార్'

ఐపీఎల్ 2026 సీజన్‌లో LSG, DC మధ్య జరిగిన మ్యాచ్ సోషల్ మీడియాలో 'స్టెయిర్‌కేస్ జైబ్ వార్'గా మారింది. KL రాహుల్ మొదటి బాల్‌లోనే గోల్డెన్ డక్‌తో అవుట్ కావడంతో LSG సోషల్ మీడియా టీమ్ ఖాళీ స్టెయిర్‌కేస్ ఫోటో పోస్ట్ చేసి ట్రోల్ చేసింది. అయితే, DC 6 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి ధీటైన సమాధానమిచ్చింది. ఈ మ్యాచ్‌లో LSG 141 ఆల్ అవుట్ కాగా, DC 142 లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత DC ఆ ఖాళీ స్టెయిర్‌కేస్ ఫోటోను కోట్ చేసి, '2024, 2025, 2026 LSGపై వరుస విజయాలు' అని రాసి పోస్ట్ చేసింది. ఇది LSGను పూర్తిగా ట్రోల్ చేసి, ఫ్యాన్స్ మధ్య భారీ చర్చకు దారితీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్