నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం నామక్కల్లో బిల్లు కాపీని తగలబెట్టి, నల్లజెండా ఎగరవేసి నిరసన తెలిపారు. ఈ బిల్లును 'బ్లాక్ బిల్లు'గా అభివర్ణిస్తూ, ఇది సొంతగడ్డపైనే తమిళులను శరణార్థులుగా మార్చే కుట్ర అని స్టాలిన్ ఆరోపించారు. 1960 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ, ఈ నిరసన జ్వాలలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని ఆయన పేర్కొన్నారు.