బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని శీతల మాత ఆలయంలో మంగళవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మహిళలు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో గుడి వద్దకు చేరడంతో తొక్కిసలాట జరిగిందని సమాచారం. పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.