ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం నమీబియాలో పర్యటించారు. కొన్ని దశాబ్దాల తరువాత ఆ దేశానికి వెళ్లిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు. నమీబియా పార్లమెంట్‌లో ప్రసంగించిన మోదీకి సభ్యులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంతేకాకుండా, దేశ అత్యున్నత పురస్కారం "ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్"ను ప్రదానం చేశారు.