టాలీవుడ్ సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో గైనకాలజిస్ట్ డా. ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ఫొటోను సినీవర్గాలు షేర్ చేస్తూ.. అభినందనలు తెలియజేస్తున్నాయి. కాగా, ఈనెల 16న రిసెప్షన్ కూడా ఉంటుందని, దీనికి సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. క్రిష్ 2016లో మొదటి వివాహం చేసుకోగా.. 2018లో విడాకులు తీసుకున్నారు.