తక్కువ పెట్టుబడితో నాణ్యమైన స్టార్ ఫ్రూట్ (కారంబోలా) సాగు చేసేందుకు సేంద్రియ పద్ధతులు ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు దిగుబడినిచ్చే ఈ పంటకు 20-32 డిగ్రీల ఉష్ణోగ్రత, సమృద్ధిగా సూర్యరశ్మి అవసరం. నీరు నిలవని గరప లేదా ఎర్ర చల్కా నేలలు ఈ సాగుకు అనుకూలం. త్వరగా దిగుబడి కోసం రైతులు అంటు కట్టిన మొక్కలను ఎంచుకోవడం ఉత్తమం. తద్వారా 2-3 ఏళ్లలోనే నాణ్యమైన, రసాయనాలు లేని దిగుబడిని పొందవచ్చు.