సినీ ఇండస్ట్రీలో ఎంతో స్టార్‌డమ్ వచ్చినా ఈ తర్వాత అవకాశాలు లేక హీరోలు ఫేడౌట్ అవుతుంటారు. ఈ కోవలోకి చెందిన వారే వడ్డే నవీన్. ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీలు తీసి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ 2016 తర్వాత వెండితెరపై కనిపించలేదు. అయితే తాజాగా ‘వడ్డే క్రియేషన్స్’ పేరుతో నవీన్ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. దీంతో నటుడిగా కాకపోయినా నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్నారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.