స్టార్ సింగర్ సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత

ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ (89) వృద్ధాప్య కారణంగా ఆదివారం సాయంత్రం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. బంగ్లాదేశ్ ఏర్పడక ముందు అవిభక్త భారతదేశంలోని ఢాకాలో సుమన్ 1937లో జన్మించారు. ఆమె బాల్యంలో ఉన్నప్పుడే.. వారి కుటుంబం ముంబైకి చేరుకుంది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హిందీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా భాషల్లో వేలాది పాటలు పాడారు. 'నా నా కర్తే ప్యార్', 'ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే' వంటి ఎన్నో ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్స్ అందించిన ఆమెకు భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్' అవార్డుతో సత్కరించింది.

సంబంధిత పోస్ట్