స్టార్‌లింక్ భారత్ ఎంట్రీపై ఉత్కంఠ.. భద్రతా అనుమతులపై కేంద్రం ఫోకస్

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ భారత మార్కెట్ లోకి ప్రవేశించేందుకు చర్చలు జరుగుతున్నాయి. భద్రతా అనుమతులు నిలిచిపోయాయన్న వార్తలను కంపెనీ ఖండించినప్పటికీ, దేశ భద్రత, సార్వభౌమాధికార అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహిస్తోంది. భారత్ కోసం ప్రత్యేక మోడల్ రూపొందించామని స్టార్‌లింక్ తెలిపింది. అయితే, తుది భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తయ్యే వరకు సేవల ప్రారంభంపై స్పష్టత రానుంది. దేశీయ టెలికాం సంస్థల పోటీ నేపథ్యంలో కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

సంబంధిత పోస్ట్