రాష్ట్ర వైఫల్యాలను కేంద్రంపై మోపుతున్నారు: కిషన్ రెడ్డి

తెలంగాణ నుంచి 53 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఎందుకు అప్పగించలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కేంద్రంపై మోపుతోందని విమర్శించారు. రైతుల నుంచి తీసుకున్న సన్నబియ్యాన్ని ఎక్కువ ధరకు పక్కరాష్ట్రాల్లో అమ్ముతూ, రాష్ట్ర ప్రజలకు నాసిరకం బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్