AP: రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) యువతకు స్వయం ఉపాధి పథకాల కింద తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేసింది. ఈ నిర్ణయంతో 11,479 మంది లబ్ధిదారులకు ఊరట లభించనుంది. అంతేకాకుండా, ఎస్సీ కార్పొరేషన్ మరియు సెర్ప్ ఆధ్వర్యంలో మరో 4,400 మందికి రాయితీ రుణాలను అందించనుంది. ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రూ. 50,000 వరకు రాయితీతో పాటు, మిగిలిన మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇవ్వనున్నారు. ఈ పథకాల అమలు కోసం ప్రభుత్వం రూ. 63.26 కోట్లను విడుదల చేసింది.