సోషల్ మీడియాలో జరిగే అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులకు సూచించారు. నెగెటివ్ పోస్టులకు స్పందిస్తూ సమయం, శక్తిని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. ఇటీవల అభిమాన సంఘాల సభ్యులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎవరో ఏదో పోస్ట్ చేశారని దానికి బదులిస్తే మనకూ వాళ్లకూ తేడా ఉండదు. మన పని మనం చేసుకుందాం. విమర్శలకు సమాధానం చెప్పకుండా ప్రేమను పంచుదాం. ప్రతిరోజూ మన పనిపై దృష్టి పెడితే విజయం సాధిస్తాం’’ అని చెప్పారు.