ఇద్దరు మైనర్ కుమార్తెలపై సవతి తండ్రి అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. భర్త మరణించడంతో అతడి తమ్ముడిని వివాహం చేసుకున్న ఓ మహిళకు మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆ ఇద్దరు మైనర్ బాలికలపై తన రెండో భర్త అత్యాచారానికి పాల్పడుతున్నాడని మహిళ ఆరోపించింది. ప్రతిరోజూ బాలికలను వేధించడమే కాకుండా, అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తనను కూడా కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕