రీల్స్ తీయాలనే మోజులో కదులుతున్న థార్ వాహనంపైకి ఎక్కి స్టెప్పులు వేసిన ముగ్గురు యువకులు కింద పడిపోయారు. ఎదురుగా వస్తున్న ట్రక్కును చూసి థార్ డ్రైవర్ సడెన్‌గా బ్రేకులు వేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేయకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.