ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు: సీతక్క

వరినాట్లకు నీటి కొరత లేకుండా చేస్తామని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. లక్నవరం సరస్సు తూముల మరమ్మత్తు పనులు పూర్తి చేసి, పంట కాలువలను నీటిని విడుదల చేశామని తెలిపారు. ఈ చెరువు కింద ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలో రామప్ప చెరువు నుంచి కెనాల్ ద్వారా లక్నవరం చెరువును పూర్తిగా నింపే ప్రణాళికను అమలు చేస్తామన్నారు. మన రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్