నేడు దేవరగట్టులో కర్రల సమరం

AP: కర్నూలు జిల్లా, దేవరగట్టులో ప్రసిద్ధ కర్రల సమరం బుధవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరగనుంది. ఈ సంప్రదాయ ఉత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే దేవరగట్టుకు చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల పోలీస్ పికెట్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవం శాంతియుతంగా సాగేలా చూడాలని అధికారులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕