ఇంకా మీ అకౌంట్‌లో రైతు భరోసా డబ్బులు పడలేదా?.. అయితే ఇలా చేయండి!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో దశలవారీగా జమ చేస్తోంది. అయినా డబ్బులు అందని రైతులు ముందుగా రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌లు, బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్‌ను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారిక పోర్టల్‌లో బెనిఫిషియరీ స్టేటస్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, మొబైల్ లింకింగ్ సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ నిధులు జమ కాకపోతే మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్