లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. భారత్‌–అమెరికా ట్రేడ్‌ డీల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఖరారవడంతో ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ భావన నెలకొంది. త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండటంతో ఎస్‌బీఐ షేర్లు దాదాపు 8 శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 700 పాయింట్లు ఎగబాకి చివరికి 485.35 పాయింట్ల లాభంతో 84,065.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 173.60 పాయింట్లు పెరిగి 25,867.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.74గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్