దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం ఓ మోస్తరు లాభాల్లో కదలాడిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 80,904.40 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత లాభాల బాట పట్టి 81,171.38 గరిష్ఠానికి చేరుకుంది. చివరకు ఇంట్రాడేలో 76.54 పాయింట్లు లాభపడి 80,787.30 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 32.15 పాయింట్ల లాభంతో 24,773.15 వద్ద ముగిసింది.