దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు, భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై స్పష్టత లేకపోవడం, మదుపర్ల అప్రమత్తతకు కారణమయ్యాయి. సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 82,634.48 వద్ద, నిఫ్టీ 16.25 పాయింట్ల లాభంతో 25,212.05 వద్ద ముగిసింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు మద్దతిచ్చాయి. రూపాయి విలువ 85.94 వద్ద కొనసాగింది.