దేశీయ మార్కెట్ సూచీలు మరోసారి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 85,150.64 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. చివరికి 31.46 పాయింట్ల నష్టంతో 85,106.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 46.20 పాయింట్ల నష్టంతో 25,986 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.21గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బీఈఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.