నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌ 241.30 పాయింట్ల నష్టంతో 77,378.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 23,431 వద్ద ముగిసింది. టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ షేర్లు లాభపడగా.. ఫైనాన్షియల్‌, హెల్త్‌, ఆటోమొబైల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

సంబంధిత పోస్ట్