అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రకటనతో దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 296.28 పాయింట్ల నష్టంతో 81,185.58 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 86.70 పాయింట్ల నష్టంతో 24,786.35 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, రిలయన్స్, NTPC షేర్లు నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎటెర్నల్, ITC, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి.