దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో సోమవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ వరుసగా రెండో రోజు, నిఫ్టీ ఐదో రోజు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 281.09 పాయింట్లు కోల్పోయి 77,728.16 వద్ద, నిఫ్టీ 78.35 పాయింట్లు కోల్పోయి 24,287.65 వద్ద స్థిరపడ్డాయి. అయితే, ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సూచీలు కోలుకోవడం ఊరటనిచ్చింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.61గా ఉంది.